భక్త సంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది. జయ విజయులని, ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో, ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు. వారు శ్రీ మహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా వుండలేమని ప్రార్ధించగా, విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు లేక శత్రువులుగా మూడు జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు. ఏడు జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని, శత్రువులుగా మూడు జన్మలలోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరుతారు. ఆ విధంగా వారు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా భూలోకంలో జన్మిస్తారు. మిగతా జన్మలు రావణ – కుంభకర్ణులు, కంస – శిశుపాలురు. హిరణ్యాక్షుడిని చంపటానికి ఆది వరాహావతారంలో, హిరణ్యకశిపునికోసం నరసింహావతారంలో, రావణ, కుంభకర్ణులకోసం శ్రీరాముడిగా, కంస, శిశుపాలురని అంతం చేయటానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు శ్రీమహావిష్ణు. ప్రస్తుతం మనం చెప్పుకునే కధ ఆది వరాహావతారం గురించి. హిరణ్యకశిపుడు భూదేవి ని చెరబట్టి సముద్రం అడుక్కి తీసుకెళ్ళాడు. ఆవిడని రక్షించటానికి శ్రీమహావిష్ణువు ఆది వరాహ రూపమెత్తి హిరణ్యాక్షుడిని వెతుక్కుంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళి, యుధ్ధంచేసి ఆతణ్ణి సంహరించి, భూదేవిని ఉధ్ధరిస్తాతడు.
శ్రీ ఆది వరాహస్వామి దేవాలయం
76
previous post