72
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో మన మార్కెట్లు మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దిగ్గజ కంపెనీల షేర్లు రాణించడంతో చివర్లో పుంజుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 66 వేల 023కి చేరుకుంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 19 వేల 811 వద్ద స్థిరపడింది.