68
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల లో బి.కామ్ చదువుతున్న విద్యార్థి ఎస్.జితేంద్ర కుమార్ ను విజిలెన్స్ అధికారులు చితక బాధడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి కారణమైన విజిలెన్స్ అధికారులు, ప్రిన్సిపల్ ను తక్షణమే అరెస్ట్ చేసి విధుల నుండి తొలగించి, విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. కళాశాల వద్ద శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు చితకబాది అతని దగ్గర నుండి బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకున్నారని అన్నారు.