దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యకట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం వస్తుందా అని ప్రశ్నించింది. ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొంది. వాయు కాలుష్యంలో 24% గడ్డి కాల్చడం వల్లే ఉత్పన్నం అవుతోందని వెల్లడించింది. సరి బేసి విధానాన్ని సుప్రీంకోర్టు సమీక్ష తరువాత అమల్లోకి తీసుకోస్తామని కేజ్రీవాల్ సర్కార్ చెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా యాప్ ఆధారిత ట్యాక్సీలను నిషేధించాలని రవాణా శాఖను కోరినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాల రాకపోకల్ని నిషేధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..
52
previous post