ఎస్పీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు..

Surrender of Maoists

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట మావోయిస్టు పప్పులూరు దళ సభ్యులు లొంగిపోయారు&period; ఈ నేపథ్యంలో పాడేరు ఎస్పీ కార్యాలయంలో తూహిన్ సిన్హా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వచ్చందంగా లొంగిపోయిన వారిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు&period; ఒడిశా రాష్ట్రం పప్పులూరు దళానికి చెందిన సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యులు కిల్లో త్రినాద్ అలియాస్ రాజేష్… కిల్లో బాబూరావు అలియాస్ సుత్తి వీరు మల్కానగిరి జిల్లా ఈతలంక గ్రామస్థులు కాగా&comma; వీరిద్దరూ పప్పులూరు ఏరియా దళ కమాండర్ పార్వతి ప్రోద్బలంతో 2008 సంవత్సరంలో మిలీషియా సభ్యులుగా చేరి&comma; సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీ పప్పులూరు దళంలో కలిమెల&comma; ఏఒబి ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులు&comma; మందుపాతర పేలుళ్లు&comma; కరువు దాడుల్లో పాల్గొన్నారు&period; అదే విధంగా లొంగిపోయిన ముగ్గురు మిలీషియా సభ్యులైన కిల్లో రాజు&period; వంతల భగత్ రామ్&comma; పాంగి సదునో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు&period; ఇటీవల మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గిపోవడం&comma; పోలీస్ కాంపులు పెరగడంతో&comma; స్వేచ్ఛగా తిరగలేక ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు&comma; అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు కమ్యూనిటీ పోలిసింగ్&comma; ఫ్రెండ్లీ పోలిసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు కల్పిస్తున్న ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు&comma; నిరుద్యోగ గిరిజన యువతకు వ్యాపార నిమిత్తం బ్యాంక్ రుణాలు అందించే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయంతో స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు&period; ఈ సందర్భముగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్&comma; జీ&period;కే&period;వీధి సిఐ జి&period;అశోక్ కుమార్&comma; సీలేరు ఎస్సై జె&period;రామకృష్ణల సేవలను కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.