భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానంతో భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రొంపిచెర్ల గ్రామపంచాయతీ, పాలెం వీది కి చెందిన వాహిదా (32) పీలేరుకు చెందిన ఖాజా కిజర్ (42) ఇరువురు 14 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తుండేవాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వారం రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు కత్తితో భార్య తల మీద నరికి వేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను అతని నుండి విడిపించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరీక్షించి, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారని తెలియజేశారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
అనుమానంతో భార్య తలపై నరికిన భర్త..
72
previous post