భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానంతో భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రొంపిచెర్ల గ్రామపంచాయతీ, పాలెం వీది కి చెందిన వాహిదా (32) పీలేరుకు చెందిన ఖాజా కిజర్ (42) ఇరువురు 14 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తుండేవాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వారం రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు కత్తితో భార్య తల మీద నరికి వేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను అతని నుండి విడిపించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరీక్షించి, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారని తెలియజేశారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
వివాహేతర సంబంధం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండవ తారీకు ప్రియుడు సాయంతో భర్తను హతమార్చిన భార్య, హత్య వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన చౌటుప్పల్ ఏసిపి మొగులయ్య ఈ సమావేశం లో సిఐ దేవేందర్ ఎస్సైలు పాల్గొన్నారు. ఏసిపి హత్య వివరాలు తెలుపుతూ
రమావత్ శీను, సరోజ దంపతులతో మాతంగి మహేష్ అన్న యువకుడు చనువుగా ఉండడంతో వీరి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో రెండవ తారీకు రాత్రి ప్రియుడు మహేష్ సహాయంతో భార్య సరోజ భర్త శీనును తాడు సహాయంతో హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా జనావాసాలు లేని కాలి ఇంటి మెట్ల పై మృతదేహాన్ని వేసి తన భర్త కనబడుటలేదని కుటుంబ సభ్యులకు తెలపడంతో మృతుడి తండ్రి , సోదరుడు కు సరోజ పై అనుమానం తో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన పోలీసులకు అక్రమ సంబంధం కారణంగా హతమార్చారాన్ని తెలుసుకొని భార్య సరోజ, ప్రియుడు మాతంగి మహేష్ ల పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ (38) ప్రియాంక (30) సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త దుర్గాప్రసాద్ (పండు) చూశాడు. కోపోద్రిక్తుడైన ఆయన ఇనుప రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టాడు. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియాంకను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. అయ్యన్నకుంటిపల్లెకి చెందిన గేరా సందీప్ గ్రామంలోని పరమేశ్వర సాయి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అయితే సందీప్ ది ఆత్మహత్య కాదు… హత్య చేసారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





Total views : 79493