87
ఈ నెల 23న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ ఆఫ్ లైన్ టిక్కెట్లు విక్రయం. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, వన్‌టౌన్ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు విక్రయించనున్నారు. టిక్కెట్ ధరలు.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే హాట్ కేక్ ల అమ్మడుబోయిన ఆన్ లైన్ టిక్కెట్లు ఆన్ లైన్ లో చాల వరకు టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆఫ్ లైన్ లో టిక్కెట్లు కోసం క్రికెట్ అభిమానులు బారులు తీరుతున్నారు.