బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్ వేశారు. తొమ్మిదిన్నరేళ్ళలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరేనని, అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరంటూ సీతక్క ఫైర్ అయ్యారు. మీ హయాంలో అక్షరాల 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు 207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుందని కేటీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలని నిలదీశారు. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను మీరు చెల్లించలేదని, చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేదని, 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు పెండింగ్ బకాయిలు, విద్యుత్ సంస్థలకు బకాయిలు, ఆర్టీసీకి బకాయిలు, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్..ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి…ఇప్పుడు బుకాయిస్తే ఏలా? అని ప్రశ్నించారు.
మీ నిర్వాకంతో గాడి తప్పిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతూ..ఈ పది నెలల కాలంలో 18 వేల కోట్ల పంట రుణాలను ప్రజా ప్రభుత్వం మాఫి చేసిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల వంటింటి భారం దించేందుకు 500 కే గ్యాస్ సిలిండర్, సామాన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రజా ప్రభుత్వమని, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు..ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. అయినా మీరు అప్పులు, బకాయిలు, హమీల గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సీతక్క చురకలేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90858