వాట్సాప్ యూజర్లు (WhatsApp users) :
వాట్సాప్ యూజర్లు(WhatsApp users) ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోలు ఆఫ్‌లైన్‌లో ఈజీగా షేర్ చేయొచ్చు. దీని కోసం డేటా వినియోగించాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Webetainfo ప్రకారం ఆఫ్‌లైన్‌లో షేర్ చేయబడిన ఫైల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని కూడా తెలుసు. అంటే సెక్యూరిటీ పరంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇతరులు వీటిని తెలుసుకోలేరు. యూజర్ల నమ్మకం నిలబెట్టుకోవడానికి ఎన్‌క్రిప్ట్ చేయడం చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ ఫీచర్‌కి సంబంధించి ఇటీవలే ఓ స్క్రీన్‌షాట్ లీక్ అయ్యింది.
ఇది చదవండి: 2024 Bajaj Pulsar N250 | సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్..!
కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే Webetainfo నివేదిక ప్రకారం, ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ నుంచి ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే మీ డివైజెస్ దగ్గర్లోనే ఉండాలి. అంతేకాదు ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను ఆన్ చేసి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫైల్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. వాట్సాప్ ఆఫ్‌లైన్ ఫైల్స్ షేరింగ్ కోసం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. కేవలం బ్లూటూత్ ద్వారా ఫైల్స్‌ను స్కాన్ చేసి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు ఆన్ చేసి అవసరం లేదనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాడటం ద్వారా వాట్సాప్ సిస్టమ్ పని చేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఇస్రో ఖాతాలో మరో ఘనతవరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని…
- చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతిచైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది. తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది. దీనిని ఆ దేశానికి సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారుచేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, విక్రయాల్లో…
- తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహింద్రా నియమితులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు. తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి