చాట్ జీపీటీ పోటీగా కృత్రిమ్:
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ తెచ్చి, తర్వాత దాన్ని జెమినీగా మార్చింది. ఇప్పుడు చాట్ జీపీటీ లాగానే ఇండియాలో కృత్రిమ్(Krutrim) వచ్చింది. మీరు చాట్ జీపీటీని వాడారా అయితే మీరు ఇప్పుడు కృత్రిమ్ని కూడా వాడాలి అనుకుంటారు. ఎందుకంటే ఇది భారతీయులు రూపొందించిన AI చాట్. దీన్ని ఓలా సీఈఓ భావిష్ అగర్వాల్ తయారు చేశారు. దీని బీటా వెర్షన్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
గంటకు 93 కి.మీ వేగంతో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ టాక్సీ
చాట్ జీపీటీ ఉంది కదా మరి ఇది ఎందుకు అంటే చాట్ జీపీటీ విదేశీయులది. ఇది భారతీయులది కాబట్టి దీన్ని వాడటం ద్వారా భారత్కి మేలు అని భావిస్తున్నారు. నిజానికి దీన్ని 2023 ఏప్రిల్లో ప్రారంభించారు. ఇప్పుడు బీటా వెర్షన్ వచ్చింది. ఈ ప్రాజెక్టులో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పటికే దీన్ని వాడిన యూజర్లు ఏం చెప్పారంటే, చాట్ జీపీటీ(Chat GPT), కృత్రిమ్(Krutrim) దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇస్తున్నాయని చెప్పారు. ఐతే, న్యూమరికల్ ప్రశ్నల విషయంలో మాత్రం కృత్రిమ్ సరైన సమధానాలు ఇవ్వలేదని చెప్పారు. కొంతమంది మాత్రం చాట్ జీపీటీ కంటే కృత్రిమ్ మెరుగైన ఆన్సర్లు ఇచ్చినట్లు చెప్పారు. కృత్రిమ్ ఇండియన్ మోడల్ కాబట్టి మన స్థానిక భాషల్లో కూడా ఇది ఆన్సర్లు ఇవ్వగలదు. అందువల్ల చాట్ జీపీటీ కంటే దీనికి ఇండియాలో ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు దీన్ని వాడాలనుకుంటే ఆలస్యం ఎందుకు లాగిన్ అయిపోయి ట్రై చెయ్యండి అంటున్నారు టెక్ నిపుణులు.
కృత్రిమ వాడే విధానం:
దీన్ని మనం వాడటం చాలా ఈజీ. మీరు https://olakrutrim.com లోకి వెళ్లాలి. తర్వాత try krutrim బటన్ క్లిక్ చేసి, మొబైల్ నంబర్ ఇచ్చి, ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు చాట్ మొదలవుతుంది. మీరు చాట్ బాక్సులో రకరకాల ప్రశ్నలు అడిగి, సమాధానం పొందవచ్చు. చూడటానికి ఇది కూడా చాట్ జీపీటీ లాగానే ఉంది. ఇది త్వరలో తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, గుజరాత్ సహా 10కి పైగా భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.