ముగిసిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు….

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరదిగింది&period; త్రిముఖ పోటీలో మెరుపు వేగంతో ప్రత్యేక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది&period; 119 స్థానాల్లో పోటీ చేసి 64 స్థానాలను సొంతం చేసుకుంది&period; అధికారాన్ని హస్తగతం చేసుకునే మేజిక్ ఫిగర్ ను దాటేసింది&period; రేపు ప్రమాణస్వీకారానికి సిద్ధమైంది&period; ఆ పార్టీకి చెందిన సీనియర్లు కూడా ఈసారి గెలిచారు&period; ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది&period; సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు&period; పలువురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు&period; గత ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 39 స్థానాలకు పరిమితమైంది&period; సీఎం కేసీఆర్ సహా&comma; పలువురు మంత్రులకు ఈసారి చేదు అనుభవం ఎదురైంది&period; ఇక బీజేపీ ఈసారి ఎన్నికల్లో పుంజుకుంది&period; సింగిల్ డిజిట్ కే పరిమితమైనప్పటికీ గతంలో కంటే ఈ సారి ఓట్లు&comma; సీట్ల సంఖ్యను పెంచుకుంది&period; పలు చోట్ల బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది&period; మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు&period; బీజేపీ మిత్రపక్షం జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం పోటీని ఇవ్వలేకపోయింది&period; ఎంఐఎం ఏడు స్థానాల్లోనూ&comma; సీపీఐ ఒక స్థానంలోనూ విజయం సాధించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.