ఒకే పార్టీ నుండి మూడవసారి ఒకే వ్యక్తి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర అని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 2014లో, 2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడవసారి కూడా అధికారం అప్పజెప్పారని ఈటల తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఈటల తన ఆనందాని వక్తం చేశారు. అలాగే మల్కాజ్ గిరి నుండి దాదాపు నాలుగు లక్షల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు తానెప్పుడు రుణపడి ఉంటానన్ని జనాలు కోరుకున్న అభివృద్ధి చేస్తానంటు ఆయన హామి ఇచ్చారు. ఇక ఇదే సందర్భంలో బీజేపీ పార్టీకి చెందిన కిషన్ రెడ్డిని బండి సంజయ్ ని ఈటల మర్యాదపూర్వకంగా కలిసారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.