కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సిర్పూర్ కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయన్నారు. వ్యక్తి గుణగణాలు, సేవా తత్పరతను ప్రజలు చూడాలన్నారు. పార్టీకి ఉండే చరిత్ర, వాటి విధానాల గురించి ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజల దగ్గర ఉండే ఏకైక ఆయుధం ఓటు అన్నారు. ఇవాళ వేసే ఓటు ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందన్నారు. కాంగ్రెస్ కారణంగా 58 ఏళ్లు కష్టపడ్డామన్నారు. కాంగ్రెస్ ఢోకా భాజీ పార్టీ అన్నారు. తాను అమరణ దీక్ష చేస్తేనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. భూములపై పెత్తానాన్ని రైతులకు ఇచ్చామన్నారు. పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామన్నారు. ఏ ఊరిలో పండే ధాన్యాన్ని ఆ ఊరిలోనే కొంటున్నామన్నారు. రైతుల హక్కుల కోసం ధరణి పోర్టల్ తెచ్చామన్నారు. తెలంగాణ వ్యవసాయం, భూమి విలువ పెరిగిందన్నారు. ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు.
Read Also..
Read Also..