దక్షిణాకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికవరకు కేవలం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, లడ్డు తయారీలో నాణ్యత లోపం, శానిటేషన్ పై నిర్లక్ష్యం, బ్లాక్ లో టికెట్టు విక్రయం, సిబ్బంది చేతివాటం వంటి పలు విషయాల్లో వార్తలోకెక్కిన రాజన్న ఆలయం ఇప్పుడు ఏకంగా నకిలీ ధృవపత్రాల బాగోతంతో వార్తల నిలుస్తోంది. ఆలయంలో ఏ.ఈ.వోగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆలయాధికారులు సైతం సీనియర్లను కాదని, ఆయనకు పదోన్నతి కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించినట్టు గత కొన్నేళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలోనే కొంతమంది ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్ కు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పప్పటికి సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు మరికొంత మంది ఉద్యోగులు, సిబ్బంది సైతం నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కనీసం నూతన కాంగ్రెస్ ప్రభుత్వమైన నకిలీలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.