తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది. ఒక వైపు డేగ కన్నుతో పరిశీలిస్తోంది. మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా కోట్లాది రూపాయలను సీజ్ చేస్తోంది. అభ్యర్థులు హద్దులు దాటకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది. పాపం మంత్రి సత్యవతి రాథోడ్ ఈ డేగ కన్నుకు చిక్కుకున్నారు. ఎన్నికల మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చారు. ఆమె ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఎఫ్ఎస్ టీ టీమ్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ తరఫున ప్రచారం కోసం ఇటీవల కొంగరగిద్దకు సత్యవతి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈక్రమంలో సత్యవతి రాథోడ్ హారతి పళ్లెంలో నాలుగు వేల రూపాయలు వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Read Also..
Read Also..