పొన్నం… మీ పార్టీ మాట తప్పినందుకు……. *గాంధీభవన్ వద్ద దీక్ష చేయ్…. *– బండి సంజయ్(Bandi Sanjay)
కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోసప పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయ్. 80 కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? కేసీఆర్ పాలనలో అన్న వర్గాలను దగా చేసినప్పుడు ఒక్కనాడు కూడా దీక్ష ఎందుకు చేయలేదు? వడ్ల కుప్పలపై రైతులు గుండెపగలి చస్తుంటే. ఎందుకు దీక్ష చేయలేదు పొన్నం. వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చిన తరువాతే కొనుగోలు చేయాల్సిందే. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొంటారా? లేదా? పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష జరపడం లేదు? బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలుపై అరిగోస పడ్డ రైతులకు అండగా నిలిచింది మేమే.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రధాని అభ్యర్ధి తెలియని కూటమికి ఎలా ఓటేస్తారు?- బండి సంజయ్
నిధులు తెచ్చి అభివ్రుద్ధి నేను చేస్తుంటే… మీరు ప్రచారం చేసుకుంటారా? అభ్యర్ధే దొరకని కాంగ్రెస్, అపర మేధావి కలిసి నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay),
నరేంద్రమోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ… ఈనెల 14న కరీంనగర్ లో దీక్ష చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో స్పందించారు.
‘‘మోదీ పదేళ్ల పాలనకు నిరసనగా దీక్ష చేస్తారా… ఎందుకు? కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఏళ్ల తరబడి బియ్యం ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా? కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి రూ.12 వేల నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తున్నరా? గ్రామాల అభివ్రుద్ధికి నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తారా? ఉజ్వల పథకం కింద ప్రజలకు ఉచితంగా సిలిండర్ ఇచ్చి సబ్సిడీ ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా?… ఏడాదిలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు దీక్ష చేస్తారా?…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయోధ్యలో రామాలయం కట్టినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసినందుకు నిరసనగా దీక్ష చేస్తారా… ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి మస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించినందుకు, పౌర సత్వ చట్ట సవరణ చేసినందుకు దీక్ష చేస్తారా? దేనికి దీక్ష చేస్తారో పొన్నం చెప్పాలి’’అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో అభ్యర్ధే కరువయ్యారని… చేతగాని కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో తాను ఎంపీగా ఏమీ చేయలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు…
పోతారం మాజీ సర్పంచులు జలంధర్, రాజయ్య, ఆలయ ఛైర్మన్ అశోక్ తదితరులు బండి సంజయ్(Bandi Sanjay) సమక్షంలో బీజేపీలో చేరారు. వారితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి కథలాపూర్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అక్కడున్న సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు… అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఏమన్నారంటే….
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా రైతుల పరిస్థితుల్లో మార్పు లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 12 రోజులవుతున్నా ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభించలేదు. అకాల వర్షాలు, ప్రక్రుతి వైపరీత్యాలను తట్టుకుని పంటలు పండించడం ఒక ఎత్తయితే… పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారింది. కొనుగోలు కేంద్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వడ్లు కొంటారా? లేదో తెలియదు.. వడ్లను కొనుగోలు కేంద్రాలవద్ద పోసి రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా పట్టించుకోరు… ఇన్ పుట్ సబ్సిడీకి దిక్కు లేదు. తాలు, తరుగు, తేమ లేకుండద వడ్లు కొంటామని, వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఆ ఊసే లేదు…
తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇవ్వడంతోపాటు 500 బోనస్ ఇచ్చిన తరువాతే వడ్లను కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకొచ్చాక… ఆ తరువాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. వర్షాలతో వడ్లు తడిసినా బాధ్యత సర్కార్ తీసుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాల్సిందే. బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడితే వారికి అండగా నిలిచి పోరాడింది బీజేపీయే. ఈసారి కూడా రైతులకు అండగా ఉంటాం.. వారి పక్షాన ప్రభుత్వంపై పోరాడతాం…
6 గ్యారంటీలను అమలు చేయకపోవడంవల్ల ప్రజలు గ్రామాల్లో ప్రశ్నిస్తున్నరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంలో తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం సిగ్గు లేకుండా 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తోంది. కర్నాటకలో 6 గ్యారంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కర్నాటక పేరు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇక్కడి ప్రజలను దగా చేశారు… ఇప్పుడు రెండు రాష్ట్రాల పేరు చెప్పి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి దేశ ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది… ప్రజలు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కోరుతున్నా….
తెలంగాణకు మోదీయే శ్రీరామరక్ష- బండి సంజయ్ | Bandi Sanjay
ఈ దేశ ప్రజంలంతా మోదీ నాయకత్వంలోనే సురక్షితంగా ఉన్నారు. తెలంగాణకు మోదీయే శ్రీరామరక్ష. ఐఎన్డీఐ కూటమి కుక్కలు చింపిన విస్తరి. అసలు ఆ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పే ధైర్యం కూడా లేదు… ప్రధాని అభ్యర్ధి తెలియని పార్టీకి ఓటేస్తారా?
కరీంనగర్ లో ఈనెల 14న పొన్నం ప్రభాకర్(ponnam prabhakar) దీక్ష చేస్తానంటూ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…. ఆయన గత పదేళ్లుగా ఏం చేస్తుండు? మోదీగారు పదేళ్లు పాలిస్తుంటే… ఇప్పుడు చేస్తాడా? అట్లయితే.. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు అరిగోస పడ్డరు.. మీకు దమ్ముంటే తెలంగాణ భవన్ వద్దకు పోయి దీక్ష చేయమనండి. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా గాంధీభవన్ ఎదుట ధర్నా చేయమనండి. అప్పుడైనా ఆ పార్టీకి జ్ఝానోదయం అవుతుందేమో….
బీజేపీకి నిరసనగా ఎందుకు దీక్ష చేస్తారు? కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఏళ్ల తరబడి బియ్యం ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా? కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి రూ.12 వేల నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తున్నరా? గ్రామాల అభివ్రుద్ధికి నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తారా? ఉజ్వల పథకం కింద ప్రజలకు ఉచితంగా సిలిండర్ ఇచ్చి సబ్సిడీ ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా?… ఏడాదిలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు దీక్ష చేస్తారా?… అయోధ్యలో రామాలయం కట్టినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసినందుకు నిరసనగా దీక్ష చేస్తారా… ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి మస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించినందుకు, పౌర సత్వ చట్ట సవరణ చేసినందుకు దీక్ష చేస్తారా?… సిగ్గుండాలే… అసలు కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధే కరువయ్యారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్(CONGRESS), బీఆర్ఎస్(BRS) పార్టీలు కలిసి నన్ను ఓడగట్టేందుకు కుట్రలు చేస్తున్నారు…
ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా?- బండి సంజయ్(Bandi Sanjay)
ఈ మధ్య బీఆర్ఎస్ అభ్యర్ధి, అపరమేధావి(వినోద్ కుమార్ ను ఉద్దేశించి) కరీంనగర్ పార్లమెంట్ ను తానే అభివ్రుద్ది చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నడు… ఐదేళ్లుగా నేను ఎంపీగా ఉన్నా… నా హయంలోనే కరీంనగర్ నుండి వరంగల్, ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు 4 లేన్ విస్తరణ పనుల కోసం వేల కోట్ల నిధులు నేను తీసుకొచ్చా. మోదీతో పనులకు శ్రీకారం చుట్టిన. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం కోసం సేతు బంధన్ కింద నిధులు నేనే తీసుకొచ్చిన పనులు ప్రారంభించినం… మరి మీరు చేసిందేమిటి… నిధులు తెచ్చింది నేను.. పనులు చేసింది నేను… మీరు చేశానని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ముఖ్యం. పని జరిగిందా? నిధులు తీసుకొచ్చామా? లేదా? ప్రజలకు మంచి జరిగిందా..లేదా? అన్నదే ముఖ్యం…. మీరెన్ని కుట్రలు చేసినా.. బండి సంజయ్(Bandi Sanjay) గెలుపు ఆపలేరు..
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలు
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్య
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్