మెదక్ జిల్లా(Medak District)లో అకాల వర్షంతో రైతులు(Farmers) నష్టపోతున్నారు. మరో వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడంతో కన్నీరు, మున్నీరు అవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇది చదవండి: గొలుసు దొంగ ను వెంటాడి పట్టుకున్న స్థానికులు
వర్షానికి ధాన్యం తడవకుండా ఉండడానికి అవసరమైన కవర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కేంద్రంలో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. ధాన్యం కుప్పలపై ఎగబడి కోతులు ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఓవైపు కోతులు, మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి