గ్రావెల్ మాఫియా (Gravel Mafia) :
ములుగు ఏజెన్సీలో అర్ధరాత్రి పూట గ్రావెల్ మాఫియా (Gravel Mafia) రెచ్చిపోతుండటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలమైన వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం, సూరవిడు గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి సమయంలో పొక్లెన్ టిప్పర్లతో తవ్వకాలు జరుపుతూ, ప్రభుత్వానికి రావలసిన కోట్ల ఆదాయానికి గండి కొడుతోంది గ్రావెల్ మాఫియా. ఏజెన్సీలో ప్రభుత్వ భూమైన, ప్రైవేటు భూమైన గ్రావెల్ తవ్వకాలు జరపాలంటే పీసా గ్రామసభ నిర్వహించి అనుమతి తీసుకోవాలి.
ఇది చదవండి : పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
కానీ ఇక్కడ ఏజెన్సీలో కొందరు రాజకీయ నాయకులు, మరియు వెంకటాపురం రెవిన్యూ శాఖ అధికారులు… మైనింగ్ శాఖ అధికారుల అండదండలతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటోంది. గ్రావెల్ మాఫియాకు కొమ్ముకాస్తున్న రెవిన్యూ శాఖ, మైనింగ్ శాఖపై ములుగు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు. వీరి ఆగడాలను షూట్ చేసేందుకు వెళ్లిన సీవీఆర్ న్యూస్ నిఘా బృందాన్ని చూడగానే … ప్రొక్లెయిన్ టిప్పర్లతో గ్రావెల్ మాఫియా ఉడాయించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ములుగు ఏజెన్సీలో గ్రావెల్ మాఫియా…