ఈరోజు నామినేషన్ చివరి రోజు కావడంతో బిజెపి అభ్యర్థి కేఎస్ రత్నం భారీ మెజార్టీతో నామినేషన్ దాఖలు చేయడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా రోడ్ షోలో కేసు రత్నం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను, చేవెళ్ల గడ్డపై కాలే యాదయ్య కుటుంబ పాలనను తమొందిస్తమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే బిఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ పాలనను కాంగ్రెస్ అభ్యర్థి నేర చరిత్ర గురించి ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అవినీతి, అక్రమాల జరిగాయని కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ అన్నారు కాలేశ్వరం పేరుతో ఎన్నో కోట్లు దోచుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ది కుటుంబ పాలనని ఎద్దేవా చేశారు కాబట్టి బిజెపి కి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ను తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ నామినేషన్ లో భాగంగా కేంద్రమంత్రి బిఎల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన నడుస్తుందని దాన్ని అంతమొందిస్తామని అలాగే నన్ను గెలిపిస్తే ప్రజలు ఏప్పుడు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తానని రత్నం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలనను అలాగే చేవెళ్ల గడ్డమీద కాలే యాదయ్య కుటుంబ పాలన అంతమొందిస్తమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు..
Read Also..