బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 19 వేల 746 కోట్లు కేటాయించామని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం అవుతుందని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించగా అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కవగా లాభం పొందారు. పనికిరాని కొండలు, గుట్టలకు కూడా రైతుబంధును గత ప్రభుత్వం అందజేసిందని విమర్శించారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని పెట్టుకున్న భూములకు కూడా రైతుబంధు అందజేశారని ఆరోపించారు. రైతు బంధు నిబంధనలను పున సమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎకరాకి ఏడాదికి 15 వేలు అందజేస్తామని భట్టి తెలిపారు. ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.