తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీలకు తగిన కేటాయింపులు లేవని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘కామారెడ్డి డిక్లరేషన్’ హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హన్మకొండ ఏకాశిల పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు.. ఏటా 20 వేల రూపాలయ కోట్లు కేటాయించాలని, 56 శాతం జనాభాకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాల ఆందోళన, డిమాండ్లపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు.
budget
తెలంగాణను దేశానికి భవిష్యత్ ఆర్థిక శక్తిగా మారుస్తామని , క్యూర్, ప్యూర్, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు . తెలంగాణ సమ్మిట్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించామని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని డిప్యూటీ సీఎం , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు .గతం కన్నా ఏ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించారు ? లక్ష్యం నెరవేరుతుందా ?
3 లక్షల 24 వేల 234 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి , ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క .మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని చెబుతూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందించడమే లక్ష్యమన్నారు . తెలంగాణను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామన్నారు .ఈసారి కూడా సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది . రైతు సంక్షేమం కోసం – రూ.23,179కోట్లు , సివిల్ సప్లయ్ శాఖకు రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు కేటాయించారు .దీనిలో ఎక్కువ భాగం వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ పధకానికి పోతుంది . అదే క్రమంలో విద్యా శాఖకు రూ.26,674 కోట్లు,వైద్య రంగానికి – రూ.13,679కోట్లు కార్మికుల సంక్షేమం కోసం రూ.999 కోట్లు , మహిళా శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు , ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,937కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించారు .
మరో వైపు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామంటున్న భట్టి గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పమని తెలిపారు . బడ్జెట్ అంటే అంకెల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని భట్టి వివరించారు. దేశంలో తెలంగాణను నెం.1గా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమన్న భట్టి సంక్షేమం, అభివృద్ధి తమకు తొలి ప్రాధాన్యం అని చెప్పారు .ఈ క్రమంలోనే శాంతి భద్రతలు కోసం రూ.11,907 కోట్లు , రాబోయే గోదావరి పుష్కరాలు కోసం రూ.500 కోట్లు పర్యాటక శాఖ కు రూ.1,224 కోట్లు , రాజీవ్ యువ వికాసం పధకానికి రూ.6వేల కోట్లు , గృహ నిర్మాణ రంగానికి రూ.7,430 కోట్లు ఐటీ రంగానికి రూ.875 కోట్లు , పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు ,చేనేత రంగానికి రూ.258 కోట్లు , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు , సాగునీటి ప్రాజెక్టులు కోసం రూ.22,615 కోట్లు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కోసం రూ.17,907కోట్లు కేటాయించారు .
మొత్తం బడ్జెట్ రూ.3,24,234 కోట్లులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు , మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ఉండడం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది . రాష్ట్రంలో కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవితబీమా సౌకర్యం అందించనున్నారు . జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు అవుతుందని పేర్కొన్నారు . దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు భట్టి . జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7శాతం ఎక్కువ అని వివరించారు . తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగింద న్నారు . 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ , 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు .మొత్తం మీద తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమానికే పెద్ద పీట వేశారని చెప్పొచ్చు .
ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు.‘‘శ్రమించేతత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం. విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలకు చేరింది. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా. జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం. హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 19 వేల 746 కోట్లు కేటాయించామని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం అవుతుందని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించగా అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కవగా లాభం పొందారు. పనికిరాని కొండలు, గుట్టలకు కూడా రైతుబంధును గత ప్రభుత్వం అందజేసిందని విమర్శించారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని పెట్టుకున్న భూములకు కూడా రైతుబంధు అందజేశారని ఆరోపించారు. రైతు బంధు నిబంధనలను పున సమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎకరాకి ఏడాదికి 15 వేలు అందజేస్తామని భట్టి తెలిపారు. ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78529