99
సైబర్ కేటుగాళ్ళు ఎస్.బి.ఐ లోగో తో వాట్సప్ గ్రూప్ ల నేమ్ ను మార్చుతున్నారు. నేరగాళ్లు అడ్మిన్ వాట్సప్ నంబర్ హాక్ చేసి పూర్తి నియంత్రణ లోకి తీసుకుంటున్నారు. ఇతర గ్రూప్ లలోకి ఎస్.బి.ఐ యాప్ ను పంపుతున్న నేరస్తులు, యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వారి బ్యాంకులను లూటి చేస్తున్నారు. దంతాలపల్లి లో ఓ రిపోర్టర్ వాట్సప్ హాక్ చేసి, మరో యువకుని ఖాతాలో నగదును విత్ డ్రా చేసారు. బాదితులు పోలీసులకు పిర్యాదు చేసారు. తమ పార్టీల, నాయకుల గ్రూప్ నేమ్ లను ఎందుకు మార్చుతున్నావని బాధితులను ఉతికి ఆరెస్తున్న వాట్సప్ గ్రూప్ సభ్యులు, తనకేమి తెలియదని నెత్తి నోరు బాదుకుంటున్న బాధితులు, ప్రజలు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.