వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా, పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 31 మంది సెక్టార్ అధికారులను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 3క్విక్ రెస్పాన్స్ అధికారులను, 3 ఈవీయం ఇంజనీర్లను నియమించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 41 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణవేణి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు చేశామని, ఈవిఎం యంత్రాల తరలింపు ఏర్పాట్లను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎనుమాముల మార్కెట్ కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈవిఎం యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేశామని అన్నారు రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి తెలిపారు.
కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత..!
129
previous post