తెలంగాణ(Telangana)లో ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్(Telangana Govt Focus) పెంచింది. రైతులు, నీటి సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఇవాళ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ మీటింగ్ నిర్వహించనుండగా.. వ్యవసాయ, తాగునీటి సరఫరా విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు.. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం రేవంత్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.