తెలంగాణ మహిళా శక్తి పథకం(Telangana Mahila Shakti Scheme):
తెలంగాణ మహిళాశక్తి పథకాన్ని సికింద్రాబాద్(Secunderabad) పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షమంది మహిళలతో నిర్వహించే సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల – SHG సభ్యులకు మరింత చేయుతనిచ్చేందుకుగాను ‘తెలంగాణ మహిళాశక్తి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు కోటి రూపాయల దాకావడ్డీలేని రుణాన్ని అందజేయనుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పైగా ఎస్‌హెచ్‌జీ(SHG) మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌జీ(SHG) మహిళల్లో ఎవరైనా మరణిస్తే గ్రూప్ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ప్రత్యేక పథకంలో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతోపాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. వడ్డీలేని రుణాల అందజేతలో భాగంగా తొలి ఏడాది ఐదువేల గ్రామాలకు 5 వేల కోట్ల రుణాలు అందించనున్నట్లు సర్కారు తెలిపింది.
ఇది చదవండి: కవిత పై రెచ్చిపోయిన సీతక్క…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి