విశాఖపట్నం జిల్లా సింహాచలం లో జీవీఎంసీ సిబ్బంది బాధితులకు నష్టపరిహారం ఇవ్వకముందే నిర్మాణాల్ని తొలగిస్తున్నారు. తొలిప్రేవంచ వద్ద నుండి అడవివరం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది బాధితులకు నష్టపరిహారం టిడియార్లు చెల్లించకపోవడంతో ఆ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు. దీనితో జీవీఎంసీ అధికారులు కు బాధితులకు మధ్య వివాదం చోటుకేసుకుంది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధితుల తరఫున టిడిపి, వైసిపి, మరియు జనసేన నాయకులు అధికారులతో వారించారు. బాధితులకు నష్టపరిహారం, టిడియార్లు అందజేసిన తదుపరి బిఆర్టిఎస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీస్ యంత్రాంగం నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో జనసేన భీమిలి ఇన్చార్జ్ పంచకర్ల సందీప్, టిడిపి నాయకుడు పాసర్ల ప్రసాదు, 98 వ వార్డు టిడిపి కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం, తో పాటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బెహరా భాస్కరరావు ఉన్నారు.
Read Also..