నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా యాజమాన్య బోర్డు..

నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా యాజమాన్య బోర్డు

Advertisements

<p>కృష్ణా జలాల కేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నడుమ పంపకాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సమాలోచనలు చేసి&period;&period; ప్రస్తుత జలాశయాల్లో ఉన్న నిల్వలు&comma; రెండు రాష్ట్రాల అవసరాలు&comma; ఇప్పటికే జరిగిన వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు ఖరారు చేసింది&period; మిగిలిన వేసవి కాలానికి సంబంధించి నాగార్జునసాగర్&comma; శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి విడుదలపై ప్రధానంగా చర్చించారు&period; తాజాగా&period;&period; నీటి కేటాయింపులపై కృష్ణా యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది&period; ఆగస్టు 15వ తేదీ వరకూ కేటాయింపులు జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది&period; దీంతో తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీలు&comma; శ్రీశైలం నుంచి 4&period;5 టీఎంసీలు కలిపి మొత్తం 21 టీఎంసీలు&comma; ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది&period; కాగా&period;&period; ప్రస్తుతం వేసవి తీవ్రతను పరిగణలోకి తీసుకున్న బోర్డు&period;&period; ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని&comma; సాగునీటికి మళ్లించకూడదని సూచించినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..