మహిళల భద్రత, సాధికారత తమ పార్టీకి అత్యంత ముఖ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

మహిళల భద్రత, సాధికారత తమ పార్టీకి అత్యంత ముఖ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisements

<p>మహిళల భద్రత&comma; సాధికారత తమ పార్టీకి అత్యంత ముఖ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు&period; మైనర్ బాలికకు&comma; నిందితుడికి వివాహం చేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రతిపాదనపై మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు&period; ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని&comma; అవి కాంగ్రెస్ పార్టీ లేదా తెలంగాణ ప్రభుత్వ అధికారిక విధానం కాదని స్పష్టం చేశారు&period; కుల పెద్దల జోక్యం ద్వారా లేదా వివాహం వంటి ప్రతిపాదనలతో ఇలాంటి తీవ్రమైన కేసులను పరిష్కరించాలనే ఆలోచనను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు&period; మైనర్ల రక్షణ కోసం 2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు&period; 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చే సమ్మతికి చట్టబద్ధత ఉండదని&comma; దీనిని సమ్మతి సంబంధంగా చిత్రీకరించే ప్రయత్నాలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు&period; నిందితుడు ఎంతటి రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తి అయినప్పటికీ&comma; బాధితురాలి ఫిర్యాదు ఈ ఘటన తీవ్రతను చాటుతోంది&period; మైనర్ల రక్షణ విషయంలో కులం&comma; మతం లేదా రాజకీయ నేపథ్యాలకు ఎలాంటి ప్రాధాన్యం లేద మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు&period; బండి సంజయ్ ఈ కేసులో కుల అంశాన్ని తీసుకురావడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు&period; మహిళా భద్రత గురించి ప్రచారం చేసే బీజేపీ&comma; ఇప్పుడు తన సొంత మంత్రి కుమారుడి విషయంలో కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు&period; బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నందున&comma; ఈ కేసుపై ప్రజల నిశిత పరిశీలన ఉండటం సహజమని ఆయన అన్నారు&period; బాధిత బాలికకు చట్టపరమైన రక్షణతో పాటు మానసిక ధైర్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గౌడ్ తెలిపారు&period; బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని&comma; నిందితుడు ఎవరైనా సరే బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.