హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్

Advertisements

<p>హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది&period; హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; పాస్‌పోర్టులు&comma; వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు&&num;8230&semi; కొంతకాలంగా ఇక్కడే ఉంటూ స్థానిక కంపెనీల్లో కార్మికులుగా చలామణి అవుతున్నారు&period; సమాచారం మేరకు పోలీసులు జీడిమెట్ల పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ ముఠాను పట్టుకున్నారు&period; వీరంతా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా దళారుల సహాయంతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు తేలింది&period; నకిలీ గుర్తింపు కార్డులను చూపించి హైదరాబాద్‌లో ఇళ్లను అద్దెకు తీసుకోవడమే కాకుండా&comma; స్థానిక పరిశ్రమల్లో ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యోగాలు సంపాదించారు&period; అక్రమ చొరబాటుదారులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు&period; అక్కడ నుంచి బంగ్లాదే‌శ్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు&period; అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు మహిళలు&comma; ముగ్గురు పురుషులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.