రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.

రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

Advertisements

<p>మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది&period; వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేయడంతో విద్యార్థులు&comma; వారి తల్లిదండ్రులు గేటు బయటే నిలిచిపోయారు&period;గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన &&num;8220&semi;మన ఊరు–మన బడి&&num;8221&semi; కార్యక్రమం కింద రెండేళ్ల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారు&period; సుమారు 40 లక్షల రూపాయల విలువైన టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ రామనాథం కొత్త తరగతి గదుల నిర్మాణం&comma; మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు&period;అయితే మొత్తం బిల్లుల్లో ఇప్పటివరకు కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని&comma; ఇంకా 33 లక్షల రూపాయలు బకాయిగా ఉన్నాయని కాంట్రాక్టర్ ఆరోపించారు&period; బిల్లుల కోసం పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు&period;పనుల నిర్వహణ కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని&comma; అప్పుదారుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందని వాపోయారు&period; తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరి మార్గంగా పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు&period;పాఠశాల ప్రారంభమైన తొలి రోజే విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.