తెలంగాణకు అలర్ట్. జూన్ 19 నుంచి భారీ వర్షాలు.

Advertisements

<p>భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ&comma; విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది&period; జూన్ 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని&comma; ఇవి వారం రోజుల పాటు కొనసాగవచ్చన్న సూచనల మేరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది&period;సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు&comma; రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; వర్షాల కారణంగా ప్రాణ&comma; ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period;నైరుతి రుతుపవనాలు జూన్ 8న జోగులాంబ గద్వాల జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి&comma; జూన్ 14 నాటికి దక్షిణ&comma; మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరించాయి&period; ఇవి రానున్న మూడు&comma; నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు&period; కాగా&comma; జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 49&period;2 మి&period;మీ&period; వర్షపాతం నమోదు కాగా&comma; సాధారణ వర్షపాతం 54&period;9 మి&period;మీ&period; కంటే ఇది 10 శాతం తక్కువగా నమోదైంది&period; వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం&comma; రానున్న రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; అయితే&comma; జూన్ 18-20 తేదీల మధ్య హైదరాబాద్&comma; రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు&period; పలు జిల్లాల్లో ఉరుములు&comma; మెరుపులతో పాటు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు&period; లోతట్టు ప్రాంతాలు&comma; నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని&comma; జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు సూచించారు&period; ప్రజలు కూడా అధికారిక ప్రకటనలను గమనిస్తూ&comma; వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..