మావోయిజాన్ని పారదోలాం.. ఇక డ్రగ్స్ వంతు.

మావోయిజాన్ని పారదోలాం.. ఇక డ్రగ్స్ వంతు -డీజీపీ సీవీ అనంద్

Advertisements

<p>రాష్ట్రాన్ని ఒకప్పుడు వణికించిన ఉగ్రవాదం&comma; మావోయిజం పూర్తిగా తగ్గిపోయాయని&comma; కానీ ఇప్పుడు అంతకంటే భయంకరమైన డ్రగ్స్ మహమ్మారి ప్రతి ఇంట్లోకి చొరబడుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు&period; రాబోయే రోజుల్లో పోలీసుల ప్రధాన పోరాటం డ్రగ్స్ రక్కసిపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు&period; విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల కట్టడికి ఇకపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని&comma; నిబంధనలు ఉల్లంఘిస్తే స్కూళ్లు&comma; కాలేజీల రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు&period; సోమవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ భవనంలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ ను ముఖ్య అతిథిగా హాజరై డీజీపీ ప్రారంభించారు&period; డ్రగ్స్ కట్టడికి విద్యార్థి దశ నుంచే పటిష్టమైన అవగాహన&comma; నిఘా అవసరమన్నారు&period; రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను అధిగమించాం&period; కానీ డ్రగ్స్ అనే కొత్త విపత్తు ప్రతి గడపకూ చేరుతోంది&period; ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది&period; దీనిని అడ్డుకోవాలంటే ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా యాంటీ డ్రగ్స్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా స్పాటర్స్ ను యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి&period; క్యాంపస్‌లో ఏ విద్యార్థి అయినా డ్రగ్స్ వాడినట్లు గుర్తిస్తే ఆ బాధ్యత పూర్తిగా యాజమాన్యాలదే&period; అలాగే ఇకపై పాఠశాలల్లో పిల్లల ప్రవర్తన&comma; స్నేహాలపై పర్యవేక్షణ ఉంచుతామని తల్లిదండ్రులు కచ్చితంగా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు&period;<&sol;p>&NewLine;<p>విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఈ మత్తు పదార్థాలు దేశంలో ఒక పెద్ద నెట్‌వర్క్‌గా మారాయి&period; ఈ దేశద్రోహుల ముఠా పాన్ షాపుల్లో చాక్లెట్లు&comma; బిస్కెట్ల రూపంలో పసిపిల్లలకు మత్తును అలవాటు చేస్తోంది&period; ఈగల్ ఫోర్స్&comma; స్థానిక పోలీసులు నిరంతరం దాడులు చేసి పెడ్లర్లను&comma; ట్రాన్స్‌పోర్టర్లను పట్టుకుంటున్నారని తెలిపారు&period; డ్రగ్స్‌కు బానిసలైన వారి పరిస్థితి వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు&period; డ్రగ్స్ తీసుకుంటే నాడీ వ్యవస్థ నాశనమవుతుంది&period; గుండె సాధారణం కంటే ఎక్కువ పనిచేయాల్సి వచ్చి తీవ్ర ఒత్తిడికి గురై చిన్న వయసులోనే చనిపోతారు&period; 3 వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఓ ఫార్మా కంపెనీ అధినేత ఇంట్లో ఇద్దరు పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని&comma; తల్లిదండ్రులు పిల్లలతో కనీస సమయం గడపకపోవడం&comma; వారు ఏం చేస్తున్నారో కనుక్కోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయపి డీజీపీ ఉదాహరణగా వివరించారు&period; ఎవరి కోసం కాకపోయినా పిల్లల భవిష్యత్తు కోసమైనా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు&period; హోంగార్డు స్థాయి నుంచి డీజీపీ వరకు పోలీస్ శాఖ అంతా ఈ పోరాటంలో నిమగ్నమై ఉందని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>డ్రగ్స్ నివారణపై విద్యార్థులు&comma; యువతకు అవగాహన కల్పించేందుకు జూన్ 26 వరకు ఈ యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కొనసాగుతుందని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ తెలిపారు&period; ఇందులో భాగంగా జూన్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు&period; ఈ ప్రదర్శనలో ఈగల్ ఫోర్స్&comma; సైబర్ సెక్యూరిటీ బ్యూరో&comma; ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ&comma; ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ షీ టీమ్స్&comma; భరోసా&comma; టాస్క్&comma;ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ à°¡à°¿ అడిక్షన్ సెంటర్&comma; హైదరాబాద్ సిటీ పోలీస్ వెపన్స్ అండ్ డాగ్ స్క్వాడ్ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి&period; మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న సేవలు&comma; పునరావాస కేంద్రాల పనితీరును ఈ స్టాళ్ల ద్వారా విద్యార్థులకు వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .