తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

Advertisements

<p>తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు&period; ప్రస్తుత సీఎస్ కే&period; రామకృష్ణారావు పదవీ కాలం 2026 జూన్ 30తో ముగియనుండటంతో&comma; కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు&period; తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి మాతృ కేడర్‌కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది&period; కేంద్ర సిబ్బంది&comma; శిక్షణా వ్యవహారాల శాఖ ఆయనను వెంటనే పేరెంట్ కేడర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది&period; ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు సంజయ్ జాజు&period; సంజయ్ 1992 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి&period; గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా&comma; పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా&comma; విశాఖపట్నం కమిషనర్‌గా సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగి ఉన్నారు&period; ఆయన 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు&period; ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలనాపరమైన అంశాలు&comma; తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది&period; రేసులో జయేశ్ రంజన్&comma; వికాస్ రాజ్ వంటి ఇతర సీనియర్ల పేర్లు ఉన్నప్పటికీ&comma; ప్రభుత్వం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .