తెలంగాణలో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు బిగ్ రిలీఫ్.

తెలంగాణలో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు బిగ్ రిలీఫ్

Advertisements

<p>తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట దక్కింది&period; విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై స్టే విధించింది&period; వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ చేసింది&period; విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది&period; మీరు బకాయిలు చెల్లించరు&comma; విద్యార్ధుల నుంచి కళాశాలలను ఫీజులు వసూలు చేయవద్దంటే వారు ఎలా నడుపుతారని కోర్టు ప్రశ్నించింది&period; అలానే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని అడిగింది&period; బడ్జెట్ సెషన్ కూడా అయిపోయినట్టు ఉందని&comma; ఇంకా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రభుత్వాని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది&period; పెండింగ్ బకాయిలు ఎప్పటి లోగా చెల్లిస్తారో తెలపాలని పేర్కొంది&period; ఈ ఏడాది ఆగస్టు15 లోపు బకాయిలు అన్ని క్లియర్ అవుతాయన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;<p>ఆగస్టు 15 లోపు బకాయిలు క్లియర్ అయితే ఆరోజే తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి&period; మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు&period; ప్రభుత్వానికి&comma; కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు&period; ఈ బకాయిల ద్వారా 2&comma;3&comma;4 ఇయర్ స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు&period; ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు&period; హైకోర్టు తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.