యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా యువతకు సీఎం రేవంత్ కీలక సందేశం.

యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా యువతకు సీఎం రేవంత్ కీలక సందేశం

Advertisements

<p>అంతర్జాతీయ యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా రాష్ట్ర యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి&period; మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు&period; యువతలో సానుకూల ఆలోచనలు&comma; నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు&period; డ్రగ్స్ సంస్కృతి వల్ల సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా&period;&period; అది శాంతిభద్రతల సమస్యలకు కూడా దారితీస్తుందని హెచ్చరించారు&period; ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనలో యువత&comma; తల్లిదండ్రులు&comma; పౌర సమాజం భాగస్వాములై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు&period; రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం&comma; సరఫరాను సమూలంగా రూపుమాపేందుకు ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని భట్టి వెల్లడించారు&period; ప్రతి తల్లి-తండ్రి తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నట్లే&period;&period; ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు&period; డ్రగ్స్ వాడుతూ&comma; సరఫరా చేస్తూ దొరికినవారెవరైనా సరే&period;&period; వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.