భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.

భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్

Advertisements

<p>విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ప్రపంచవ్యాప్తంగా ఎబోలా&comma; బుండిబుగ్యో వైరస్‌à°² వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ ఈ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల చేసింది&period; భారత్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై తప్పనిసరిగా హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది&period; ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్ సువిధ 2&period;0 పోర్టల్‌ను పౌర విమానయాన శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది&period; ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి&period; గత 21 రోజుల్లో తాము ఏయే దేశాలు&&num;8230&semi; ప్రాంతాలు సందర్శించారనే పూర్తి ప్రయాణ చరిత్రను&comma; అలాగే ప్రస్తుత ఆరోగ్య లక్షణాలను ఈ పోర్టల్‌లో ఖచ్చితంగా పొందుపరచాలని సూచించింది&period; ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన హెల్త్ డిక్లరేషన్ ఫారమ్‌ను విమానాశ్రయాల్లోని కౌంటర్ల వద్ద సిబ్బందికి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది&period; వైరస్ దేశంలోకి వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయాణికులందరూ ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని&comma; ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు సహకరించాలని కేంద్రం కోరింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.