హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్.

హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్

Advertisements

<p>కాంగ్రెస్ ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన సుమారు 13 వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు&period; నల్గొండ జిల్లా కనగల్‌ వేదికగా ప్రభుత్వ&comma; ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలపై ఎలాంటి టోల్ టాక్స్ భారం పడకుండా ఉండేలా డిజైన్ చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించారు&period; అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్‌లో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు&comma; 83 కోట్లతో తొలిదశ తాగునీటి శుద్ధి కేంద్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు&period; సభలో బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు&period; గతమే&period;&period; కానీ భవిష్యత్తు లేదంటూ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు&period; పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై&period;&period; రెండున్నరేళ్ల ప్రజా పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు&period; మూసీ పునరుజ్జీవ పనులను త్వరలో పూర్తిచేసి నల్గొండ ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి చేస్తామన్నారు సీఎం రేవంత్&period;<&sol;p>&NewLine;<p>ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల మూసీ కష్టాలు త్వరలోనే తొలగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు&period; మూసీ పునరుజ్జీవంతో జిల్లాలో కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పారు&period; పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌&comma; అంతకుముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లాకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు&period; ఇప్పుడిప్పుడే నిధులు వస్తున్నాయన్నారు&period; గులాబీ పార్టీపై సెటైర్లు వేస్తూ&period;&period;పూటకో పేరు మార్చుకునే పార్టీ అని&comma; ఇవాళ బీఆర్‌ఎస్‌&period;&period; రేపు హెచ్‌ఆర్‌ఎస్‌ అవుతుందని ఎద్దేవా చేశారు&period; హరీశ్‌రావు రాష్ట్ర సమితి అవుతుందని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రోడ్లను అభివృద్ధి చేయడం చారిత్రాత్మకమని జలవనరుల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు&period;13 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్లు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు&period; ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ను ఆదరించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు&period; తమ శరీరంలో శక్తి ఉన్నంత వరకు సేవలు అందిస్తామని&comma; తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.