రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన

Advertisements

<p>బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారు&period; మూడు రోజుల పర్యటన కోసం నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన&period;&period;రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు&period;<br &sol;>&NewLine;ఇవాళ హైదరాబాద్‌లోని వీబీఐటీలో నిర్వహించే &OpenCurlyQuote;వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు&period; అనంతరం వరంగల్‌కు వెళ్లి గిరిజన ప్రతినిధులతో సమావేశమై&comma; ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు&period; రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు&period; ఇక జూన్ 30à°¨ ఘట్‌కేసర్‌లో నిర్వహించే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు&period; ఈ పర్యటనలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు&comma; తెలంగాణలో పార్టీ విస్తరణపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు నితిన్ నబిన్&period; రాష్ట్ర నాయకులతో కలిసి పలు సమీక్షలు&comma; సమావేశాల్లో పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;<p>దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని&period;&period;రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; బెంగాల్లో కార్యకర్తలు కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారని&period;&period;తెలంగాణలోనూ కార్యకర్తలు పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు&period; డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే&period;&period; తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు&period; లోక్‌సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందని గుర్తు చేశారు&period; ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని&period;&period; త్వరలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని నితిన్ నబిన్ ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.