భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.

భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు

Advertisements

<p>రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి&period; ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి &OpenCurlyQuote;రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు&period; వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; మధిర నియోజకవర్గంలో రేపు నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది&period; అయితే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు&comma; ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సభను రద్దు చేశారు&period; రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>సభను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; దీనిని &OpenCurlyQuote;రైతు భరోసా పంపిణీ సదస్సు’గా నిర్వహించనున్నారు&period; కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రులు&comma; ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు&period; రేపు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది&period; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఇందులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు&period; జిల్లాల్లోని రైతు వేదికల ద్వారా డిజిటల్‌&comma; వర్చువల్‌ విధానంలో సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.