తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు.

తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు

Advertisements

<p>రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది&period; రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది&period; మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా కొందరు పెన్షన్ నగదును డ్రా చేస్తున్నట్లు నిఘా వర్గాలు&comma; క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది&period;<br &sol;>&NewLine;సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఈ అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది&period; చనిపోయినవారు&comma; అర్హత లేని వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది&period;<br &sol;>&NewLine;అనర్హుల తొలగింపుతో మిగిలే నిధులను నిజమైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది&period; ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా&comma; తాజాగా గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో మరో లక్ష మంది అర్హులకు త్వరలో పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది&period;<br &sol;>&NewLine;రాష్ట్రంలో మొత్తం దాదాపు మూడు లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్ సౌకర్యం అందనున్నట్లు తెలుస్తోంది&period; వృద్ధులు&comma; వితంతువులు&comma; చేనేత కార్మికులు&comma; గీత కార్మికులు&comma; దివ్యాంగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించనుంది&period; త్వరలోనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.