నంద్యాల – కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>నంద్యాల&comma; కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న కారు తమ్మరాజుపల్లె సమీపానికి చేరుకోగానే టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది&period; ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందారు&period; సురేష్ రెడ్డి గతంలో నంద్యాల&comma; పాణ్యం పోలీస్ స్టేషన్‌లో కూడా విధులు నిర్వహించారు&period; అదే కారులో ప్రయాణిస్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు&period; అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది&period; ఘటనపై సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period; టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు&period; ఇటీవలి కాలంలో నంద్యాల–కర్నూలు జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ప్రయాణికులు&comma; వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.