వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు.

వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు

Advertisements

<p>ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ&comma; అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కురిపించుకుంటున్న అగాపే హోలిస్టిక్ క్లినిక్ బాగోతం వెలుగులోకి వచ్చింది&period; చట్టబద్ధమైన వైద్య అర్హతలు లేకుండానే&comma; డాక్టర్ బోర్డు తగిలించుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ వైద్య దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; వరంగల్ నగర కేంద్రంగా సుబ్రమణ్యం అనే వ్యక్తి ఎలాంటి సర్టిఫికేట్లు&comma; రిజిస్ట్రేషన్లు లేకుండా అగాపే హోలిస్టిక్ క్లినిక్ పేరుతో పెద్ద ఎత్తున వైద్య సేవలు నిర్వహిస్తున్నాడు&period; కైరోప్రాక్టిక్&comma; ఆక్యుపంచర్&comma; ఫిజియోథెరపీ&comma; స్పైన్ థెరపీ&comma; హోలిస్టిక్ మెడిసిన్ అంటూ రకరకాల పేర్లతో హైటెక్ వైద్యం ముసుగులో అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు&period; వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేసి ఈ నకిలీ సామ్రాజ్యాన్ని విస్తరించడం చూస్తుంటే ఇతని వెనుక ఉన్న శక్తులెవరో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; ఒక క్లినిక్ నడపాలంటే సంబంధిత వైద్య మండళ్లు&comma; ఆరోగ్య శాఖ అనుమతులు తప్పనిసరి&period; కానీ ఈ క్లినిక్‌కు ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్లు లేవని సమాచారం&period; పేరుకు ముందు డాక్టర్ అని వేసుకోకపోయినా&period;&period; లోపల మాత్రం రోగులకు హై-లెవల్ ట్రీట్‌మెంట్లు ఇస్తూ చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు&period; సరైన డిగ్రీ&comma; కనీస అర్హత లేకుండా స్పైన్ థెరపీ లాంటి సున్నితమైన వైద్యం చేయడం రోగుల ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; నగరం నడిబొడ్డున ఇంతపెద్ద దందా సాగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు&period; ఇప్పటివరకు ఈ క్లినిక్‌పై ఎలాంటి విచారణ జరపకపోవడం&comma; చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది&period; అమాయక రోగుల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఈ అగాపే హోలిస్టిక్ క్లినిక్‌పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి&comma; సమగ్ర విచారణ జరిపి సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు&comma; స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; అధికారుల విచారణ అనంతరమే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.