నల్గొండ జిల్లా చందపేట కేసును ఛేదించిన పోలీసులు..

నల్గొండ జిల్లా చందపేట కేసును ఛేదించిన పోలీసులు

Advertisements

<p>నల్గొండ జిల్లా చందంపేట మండలంలో రోడ్డు ప్రమాదంగా నమోదైన మృతి కేసును పోలీసులు ఛేదించినట్లు దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు&period; బిల్డింగ్ తండాకు చెందిన రమావత్ నర్సింహ హత్య కేసులో అతని రెండో భార్య రమావత్ జ్యోతి&comma; ఆమె అక్క రమావత్ లక్ష్మి&comma; ప్రియుడు నేనావత్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు&period; మొదట ప్రమాదంగా కనిపించిన ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది&period; మృతుడు నర్సింహకు నిందితులు మద్యం తాగించి&comma; అనంతరం నోరు&comma; ముక్కు మూసి హత్య చేసి&comma; ప్రమాదంగా చిత్రీకరించినట్లు డీఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు&period; ఘటన స్థలంలో ట్రాక్టర్ బ్యాటరీ&comma; పానర్ ఉంచి దొంగతనానికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు&period;&period; డిండి సీఐ బీసన్న&comma; చందంపేట ఎస్ఐ లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు&period; కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ&comma; డీఎస్పీ అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..