హైదరాబాద్‌ రామంతాపూర్‌లో SOT పోలీసుల దాడులు.

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో SOT పోలీసుల దాడులు

Advertisements

<p>ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు&period; ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ పేరుతో నడుస్తున్న ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌లో తనిఖీలు చేపట్టారు&period; గడువు ముగిసిన ఫుడ్ కలర్స్&comma; ఫ్లేవర్లు&comma; ఫంగస్ పట్టిన డ్రైఫ్రూట్స్‌తో పాటు లేబుల్ లేని పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు&period; తనిఖీల్లో 2 కిలోల ఫంగస్ పట్టిన ఎండు అంజీర్&comma; గడువు ముగిసిన త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్&comma; వీకేఎల్ ఫుడ్ ఫ్లేవర్&comma; నాలుగు బాక్సుల ఐడాకాల్ సింథటిక్ ఫుడ్ కలర్&comma; నాలుగు డబ్బాల గడువు ముగిసిన లూజ్ సింథటిక్ ఫుడ్ కలర్&comma; 1&period;5 కిలోల లూజ్ టూటీ ఫ్రూటీ స్వాధీనం చేసుకున్నారు&period; వీటన్నింటినీ ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు&period;సీజ్ చేసిన పదార్థాలతో పాటు యూనిట్ నిర్వాహకుడు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు&period; ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు&period; నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.