కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ బాలుర హాస్టల్‌లో అనుమానాస్పద మృతి.

కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ బాలుర హాస్టల్‌లో అనుమానాస్పద మృతి

Advertisements

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో చదువుతున్న 10 ఏళ్ల విద్యార్థి కొండల్లి అఖిల్ మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; మరోవైపు&comma; బాలుడి మరణానికి గల కారణాలపై భిన్న కథనాలు వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు&comma; పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;హాస్టల్ వార్డెన్ తెలిపిన వివరాల ప్రకారం&&num;8230&semi; ఈ నెల 10వ తేదీన బాలుడికి ఫిట్స్ రావడంతో పాటు నోటిలో నురుగు రావడం గమనించి వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు&period; అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా&comma; అనంతరం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని&comma; అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వెల్లడించారు&period; చికిత్స ఖర్చుల కోసం రూ&period;30 వేల ఆర్థిక సహాయం కూడా అందించినట్లు వార్డెన్ తెలిపారు&period;<br &sol;>&NewLine;ఈ ఘటనపై స్పందించిన సంబంధిత సంక్షేమ శాఖ జిల్లా అధికారి&&num;8230&semi; బాలుడికి లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు&period; అయితే తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని&comma; పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం స్పందిస్తానన్నారు&period;<br &sol;>&NewLine;అయితే&comma; కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల్లో బాలుడికి రక్త వాంతులు అయినట్లు నమోదు కావడంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి&period; ఒకవైపు ఫిట్స్ వచ్చాయని&comma; మరోవైపు రక్త వాంతులు అయినట్లు రికార్డుల్లో ఉండటంతో అసలు మరణానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.