హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.

Advertisements

<p>తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు&comma; అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది&period; కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది&period; రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని ఒక స్థలానికి సంబంధించి హైకోర్టు గతంలోనే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది&period; అయితే&comma; ఆ ఆదేశాలను పక్కనబెట్టి&comma; సదరు స్థలం పార్కుకు చెందిందంటూ హైడ్రా అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేసి బోర్డును ఏర్పాటు చేశారు&period; హైడ్రా ఏకపక్ష చర్యలను సవాలు చేస్తూ బాధితులు హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు&period; కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు&period; ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు&period;&period; హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది&period; న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది&period; చట్టాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వ విభాగాలు ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ&comma; ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.

ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.