నేడు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ పనులపై చర్చ.

Advertisements

<p>కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇంతవరకు జరిగిన పరీక్షలు&comma; ఫలితాలు&comma; చేపట్టాల్సిన పనులపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ నేడు దిల్లీలో సమావేశం కానుంది&period; చేయాల్సిన పనులపై రోడ్‌మ్యాప్‌ సహా ఆరు అంశాలపై కమిటీ చర్చించనుంది&period; నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ సిఫార్సు మేరకు పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ చేసిన పరీక్షలు&comma; వచ్చిన ఫలితాలపై కమిటీ చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి&period; ఎన్‌డీఎస్‌ఏలోని మెంబర్‌ టెక్నికల్‌ ఛైర్మన్‌గా జూన్‌ 30à°¨ ఏర్పాటైన ఈ కమిటీలో నీటిపారుదలశాఖ సంయుక్త కార్యదర్శి&comma; ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్&comma; సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్&comma; సీడబ్ల్యూసీలోని గేట్ల విభాగం డైరెక్టర్&comma; దిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త షాహిద్‌ నూర్&comma; సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు హనుమంతప్ప&comma; పి&period;ఎస్‌&period;కుంజీర్&comma; నీటిపారుదలశాఖ హైడ్రాలజీ విభాగం ఎస్‌ఈ సభ్యులుగా ఉన్నారు&period; ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు మేడిగడ్డ&comma; అన్నారం&comma; సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి తీసుకున్న చర్యలపై నీటిపారుదలశాఖ మొదట ప్రజంటేషన్‌ ఇస్తుంది&period; ఇందులో చేసిన పరీక్షలు&comma; ఫలితాలు&comma; జియో టెక్నికల్&comma; జియో ఫిజికల్&comma; స్ట్రక్చరల్‌ ఇన్వెస్టిగేషన్స్&comma; వీటి ఫలితాలతోపాటు సీకెంట్‌ పైల్స్‌ గురించి చర్చిస్తారు&period; ప్రతిపాదించి చేయని క్రాస్‌హోల్‌ సెస్మిక్‌ టెస్టింగ్‌పై కూడా సాంకేతికంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది&period; రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీ పాత్ర&comma; రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.