తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై సీఎస్ సమీక్ష.

Advertisements

<p>ప్రభుత్వ ఉద్యోగులు&comma; పెన్షనర్లు&comma; వారి కుటుంబ సభ్యులకు మెరుగైన&comma; నాణ్యమైన వైద్యా సేవలు అందించేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు&period; సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు&comma; ప్యాకేజీ రేట్ల సమీక్షపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో వివిధ అంశాలపై విస్తృత చర్చ జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్&comma; సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు&period; ఉద్యోగులు&comma; పెన్షనర్లకు అత్యవసర వైద్య సహాయం ఎప్పుడు వచ్చినా వెంటనే అందేలా 24 గంటల ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు&period; నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు&period; ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఆరోగ్య పథకంలో మెరుగైన మార్పులు తెస్తోందని&comma; దీని ద్వారా వేలాది మంది ఉద్యోగ&comma; పెన్షనర్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.