ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు&period; రాష్ట్ర అభివృద్ధి&comma; పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా తాజా పర్యటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది&period; 2 రోజుల పాటు సాగనున్న టూర్‌లో భాగంగా నేడు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు&period; ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్&comma; రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ&comma; మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన కేంద్ర నిధులు&comma; అనుమతులపై సంబంధిత కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు&period;<br &sol;>&NewLine;ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని&comma; రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు&comma; పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు&period; అదేవిధంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ&comma; ప్యాకేజీలతో పాటు పండిన పంటలకు మద్దతు à°§à°°&comma; ఎరువుల సరఫరా వంటి అంశాలపై మంత్రులతో భేటీ కానున్నారు&period; చివరగా ఆయన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే&comma; రాహుల్ గాంధీ&comma; కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయి రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.